నాస్డాక్ డౌన్… డౌజోన్స్ అప్
వాల్‌స్ట్రీట్ మిశ్రమంగా ఉంది. ఆరంభంలో నాస్డాక్ గ్రీన్‌లో ఉన్నా… ఇపుడు రెడ్‌లోకి వచ్చింది. అయితే నష్టాలు అర శాతంలోపే ఉన్నాయి. టెక్ షేర్లతోపాటు ఐటీ షేర్లలో స్వల్ప ఒత్తిడి వస్తోంది. దీంతో ఎస్ అండ్ పీ 500 సూచీ కూడా 0.5 శాతం లాభాలకే పరిమితమైంది. వీటికి భిన్నంగా డౌజోన్స్ ఒక శాతంపైగా లాభంతో ట్రేడవుతోంది. యూరో మార్కెట్లు మాత్రం ఆకర్షణీయ లాభాల్లో ఉన్నాయి. ముఖ్యంగా జర్మనీ డాక్స్ రెండు శాతంపైగా లాభంతో ఉంది. ఇతర సూచీలు కూడా చక్కటి లాభాలు ఉండటంతో యూరో స్టాక్స్ 50 సూచీ 1.8 శాతం లాభంతో ట్రేడవుతోంది. మార్కెట్ బుధవారం రాత్రి ఫెడ్ నిర్ణయం కోసం ఎదురు చూస్తోంది. ఈలోగా రష్యా, ఉక్రెయిన్ మధ్య జరిగే చర్చల ఫలితాలు కూడా మార్కెట్‌ను ప్రభావితం చేసే అవకాశముంది.