NIFTY TODAY: 16,600పైన నిలబడేనా?
అంతర్జాతీయ మార్కెట్లకు అనుగుణంగా మన మార్కెట్లు కూడా భారీ లాభాలతో ప్రారంభం కానున్నాయి. నిఫ్టి క్రితం ముగింపు 16,345. ఇవాళ ఓపెనింగ్‌లోనే నిఫ్టి 16600ని తాకే అవకాశముంది. అప్ బ్రౌకౌట్ కూడా ఇక్కడే ప్రారంభం కానుంది. యూరో మార్కెట్లలో భారీర్యాలీకి ఇవాళ కొసాగింపు ఉంటుందా అన్నది కీలక అంశం కాగా, అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు కూడా మార్కెట్ సెంటిమెంట్‌ను ప్రభావితం చేసే అవకాశముంది. అమెరికా ఫ్యూచర్స్ ఇపుడు డల్‌గా ఉన్నాయి. ఇవాళ్టి ట్రేడింగ్ లెవల్స్ ఇలా ఉన్నాయి.
అప్ బ్రేకౌట్ 16,600
రెండో ప్రతిఘటన 16,652
తొలి ప్రతిఘటన 16,480
నిఫ్టికి కీలకం 16,251
తొలి మద్దతు 16210
రెండో మద్దతు 16160
డౌన్ బ్రేకౌట్ 16090