For Money

Business News

NIFTY TODAY: 16,650 కీలకం

అంతర్జాతీయ మార్కెట్లకు అనుగుణంగా మన మార్కెట్లు కూడా నష్టాలతో ప్రారంభం కానున్నాయి. నిఫ్టి క్రితం ముగింపు 16,793. సింగపూర్ నిఫ్టి స్థాయి నష్టాలతో ప్రారంభమైతే… నిఫ్టి 16,600 -1650 ప్రాంతంలో ప్రారంభం కావొచ్చు. నిఫ్టికి ఇదే స్థాయిలో మద్దతు ఉన్నందున… నిఫ్టి ఇక్కడ నిలదొక్కుకుంటుందేమో చూడాలి. ముఖ్యంగా చమురు ధరలు భారీగా పెరుగుతున్నాయి. సూచీల ఆధారంగా ట్రేడింగ్‌ చేసే వారు … షేర్లను భిన్నంగా చూడండి. ఎందుకంటే క్రూడ్‌, డాలర్‌తో కంపెనీల పనితీరుపై ప్రతికూల ప్రభావం చూపే అవకాశముంది. నిఫ్టి ఇవాళ్టి ట్రేడింగ్‌ లెవల్స్‌…

అప్‌ బ్రేకౌట్‌ 17069
రెండో ప్రతిఘటన 16991
తొలి ప్రతిఘటన 16940
నిఫ్టి కీలక స్థాయి 16655
తొలి మద్దతు 16648
రెండో మద్దతు 16597
డౌన్‌ బ్రేకౌట్‌ 16519

అమెరికా ఫ్యూచర్స్‌ స్వల్పంగా గ్రీన్‌లో ఉన్నాయి. ముఖ్యంగా యుద్ధానికి సంబంధించిన వార్తలను విస్మరించొద్దు.