బ్లూస్టోన్ జ్యువలరీ ఐపీఓ

రతన్ టాటా మద్దతు ఉన్న బ్లూ స్టోన్ జ్యువలరీ కంపెనీ క్యాపిటల్ మార్కెట్‌లో ప్రవేశించేందుకు రంగం సిద్ధం అవుతోంది. కంపెనీ వ్యాల్యూయేషన్ రూ. 12,000 కోట్ల నుంచి రూ. 15,000 కోట్లు ఉండే అవకాశముంది. మార్కెట్ నుంచి రూ. 1500 కోట్లు సమీకరించేందుకు ఐపీఓకు రావొచ్చని తెలుస్తోంది. ఇది వరకే ఇన్వెస్ట్‌మెంట్ బ్యాంకర్స్‌గా ఐసీఐసీఐ సెక్యూరిటీస్, ఐఐఎఫ్‌ఎల్ సెక్యూరిటీస్, జెఫెరీస్, జేఎం ఫైనాన్షియల్ సంస్థలను నియమించింది కంపెని.22-23 ఆర్థిక సంవత్సరంలో రెండో త్రైమాసికంలో అంటే జూన్ తరవాత ఐపీఓకు రావొచ్చు. ఈ ఆఫర్‌లో కొత్త షేర్ల జారీ ఉండకపోవచ్చని, ఉన్న ప్రమోటర్లే తమ వాటాలో కొంత భాగాన్ని ప్రజలకు అమ్ముతారని తెలుస్తోంది. Bluestone.com ద్వారా నగలను అమ్ముతున్న ఈ కంపెనీ 2019లో ముంబైలో తొలి స్టోర్‌ను ప్రారంభించింది. ఇపుడు అనేక నగరాల్లో స్టోర్లు ఉన్నాయి.