రష్యా షేర్ మార్కెట్లో రక్తపాతం
రష్యా మరి ఎందుకు యుద్ధం చేస్తోందో? నియంతగా పేరుపడిన పుతిన్ పంతానికి వెళ్ళి ఉక్రెయిన్పై దాడికి వెళ్ళారా లేదా అన్నది తెలియదు కాని… యుద్ధం వల్ల రష్యా షేర్ మార్కెట్ కుప్పకూలిపోయింది. మాస్కో స్టాక్ ఎక్స్ఛేంజీ సూచీ ఏకంగా 38 శాతంపైగా క్షీణించింది. 2735 నుంచి 1681 పాయింట్లకు పడింది. ఇపుడు కూడా 34 శాతం నష్టంతో 2030 వద్ద ట్రేడవుతోంది. అనేక ప్రముఖ కంపెనీల షేర్లు సగానికి పడ్డాయి. రష్యాలో రుణాలు ఇచ్చే అతి పెద్ద సంస్థ అయిన సెర్ బ్యాంక్ పీజేఎస్సీ షేర్ 49 శాతం క్షీణించగా, సహజవాయువు ఉత్పత్తి చేసే ప్రభుత్వం సంస్థ గాజప్రామ్ పీజేఎస్సీ షేర్40 శాతం క్షీణించింది. ఒకే ఒక్క రోజు రష్యా షేర్ మార్కెట్ ఇన్వెస్టర్ల సంపద దాదాపు రూ. 20 లక్షల కోట్లు ఆవిరైపోయింది.