ల్యాంకో విద్యుత్ ప్లాంట్ కోసం మెగా, శ్రీనిరాజు పోటీ
విజయవాడ మాజీ ఎంపీ, పారిశ్రామికవేత్త రాజగోపాల్‌కు చెందిన ల్యాంక్ ఇన్‌ఫ్రాటెక్‌కు ఉత్తరప్రదేశ్‌లో 1200 మెగావాట్ల విద్యుత్ ప్లాంట్ ఉంది. రుణాలు చెల్లించకపోవడంతో యూపీలోని అన్పారాలో ఉన్న ఈ ప్లాంట్‌ను బ్యాంకులు అమ్మానికి పెట్టాయి. ఈ ప్లాంట్ కొనుగోలు చేసేందుకు మెగా ఇంజినీరింగ్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, టీవీ9 మాజీ అధినేత శ్రీనిరాజుకు చెందిన కంపెనీ ఐ ల్యాబ్ పోటీ పడుతున్నాయి. విద్యుత్ ప్లాంట్ అమ్మకానికి పెట్టి… బిడ్లను ఆహ్వానించగా మెగా ఇంజినీరింగ్, ఐ ల్యాబ్‌తో పాటు మధ్యప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి కమల్ నాథ్ సమీప బంధువు రితూ పూరికి చెందిన కంపెనీ కూడా బిడ్ వేసింది. ఆయనకు చెందిన హిందుస్థాన్ పవర్ ప్రాజెక్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ (పాత పేరు మోసర్ బేయర్) బిడ్ వేసింది. అగస్తా వెస్ట్‌ల్యాండ్ స్కామ్‌లో రుతూ పురి అరెస్టయి, జైలుకు కూడా వెళ్ళిన విషయం తెలిసింద. ఈ మూడు కంపెనీల బిడ్లను సేకరించిన బ్యాంకులు.. వీటిని పరిశీలించి నివేదిక ఇవ్వాల్సిందిగా ప్రముఖ ఆడిటింగ్ కంపెనీ డెలాయిట్‌ను కోరాయి. ‘బిడ్స్ వచ్చాయని, వాటిని విశ్లేషిస్తున్నామని… విశ్లేషణ నివేదిక వచ్చాక తుది నిర్ణయం తీసుకుంటామ’ని బ్యాంకర్లు అంటున్నారు. రూరల్ ఎలక్ట్రిఫికేషన్ కార్పొషన్ (ఆర్ఈసీ) లీడ్ మేనేజర్‌గా ల్యాంక్ ఇన్‌ఫ్రాటెక్‌కు రూ. 12,000 కోట్ల మేరకు రుణాలు ఇచ్చాయి. కంపెనీ రుణాలు చెల్లించకపోవడంతో… ఐడీబీఐ బ్యాంక్ నేతృత్వంలోని బ్యాంకులు వాటాలతో పాటు కంపెనీ నిర్వహణను తమ చేతికి తీసుకున్నాయి. ఇపుడు ఆ కంపెనీకి వొదిలించుకునేందుకు ప్రయత్నిస్తున్నాయి. బ్యాంకులు ఆహ్వానించిన బిడ్లలో కంపెనీ ఎంటర్ప్రైజ్ వ్యాల్యూ రూ.819 కోట్లుగా పేర్కొన్నారు. అంటే కనీస బిడ్ మొత్తం ఇదేనన్నమాట. దీనిపైన ఎవరు ఎక్కువ ఆఫర్ చేస్తేవారికి పవర్ ప్లాంట్ ఇస్తారు.
(file photo used)