భారీ నష్టాల్లో వాల్‌స్ట్రీట్
వాల్‌స్ట్రీట్‌కు మళ్ళీ యుద్ధ భయం పట్టుకుంది. ఈసారి టెక్, ఐటీ సహా ఇతర ఎకానమీ షేర్లు కూడా భారీగా క్షీణించడం విశేషం. నాస్డాక్, ఎస్ అండ్ పీ 500 సూచీతో పాటు డౌజోన్స్ కూడా ఏకంగా 1.2 శాతంపైగా నష్టంతో ఉన్నాయి. ఎస్ అండ్ పీ 500 విక్స్ 7.74శాతం పెరగడం విశేషం. క్రూడ్ ఆయిల్ ధరలు తగ్గడంతో ఎనర్జీ షేర్లు స్వల్పంగా దెబ్బతిన్నాయి. దీని ప్రభావం డౌజోన్స్‌పై పడుతోంది. ఇరాన్, ఫ్రాన్స్ మధ్య చర్చలు తుది దశలో ఉన్నాయని, ఇరాన్ చమురు సరఫరా పెంచుతుందనే వార్తలతో క్రూడ్ ధరలు తగ్గాయి. కరెన్సీ మార్కెట్లో డాలర్ మళ్ళీ బలపడింది. డాలర్ ఇండెక్స్ ఇపుడు 95.8 వద్ద ట్రేడవుతోంది.