డిసెంబర్లో ఐఐపీ ఢమాల్
డిసెంబర్ నెలలో పారిశ్రామిక ఉత్పత్తి మళ్ళీ క్షీణించింది. ఈ నెలలో ఇండెక్స్ ఆఫ్ ఇండస్ట్రియల్ ప్రొడక్షన్ (ఐఐపీ) 0.4 శాతానికి పడిపోయినట్లు నేషనల్ స్టాటిస్టికల్ ఆఫీస్ (ఎన్ఎస్ఓ) వెల్లడించింది.ఇది పదినెలల కనిష్ఠ స్థాయి. నవంబర్ నెలలో ఐఐపీ వృద్ధి 1.3 శాతం ఉండేది. 2020 డిసెంబర్ నెలతో పోలిస్తే 2021నెలలో ఎనిమిది కీలక రంగాలు డీలా పడ్డాయి. ఐఐపీలో ఈ ఎనిమిది రంగా వాటా 40 శాతం. దీంతో డిసెంబర్ నెలలో ఐఐపీ పడుతుందని ముందే ఊహించారు. ఐఐసీలో మూడో వంతు తయారీ రంగానిది. ఈ రంగం వృద్ధి రేటు డిసెంబర్లో 0.1 శాతం క్షీణించింది.2021 ఫిబ్రవరి తరవాత ఇలా క్షీణించడం ఇదే మొదటిసారి.