క్రిప్టో కరెన్సీని నిషేధించం…
క్రిప్టో కరెన్సీల విషయంలో తాము ఎలాంటి చర్యలు తీసుకోమని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అన్నారు. క్రిప్టో కరెన్సీని తాము చట్టబద్ధం చేయమని, అలాగే నిషేధించమని కూడా ఆమె రాజ్యసభలో అన్నారు. అలాగే ఈ కరెన్సీలను నియంత్రించే ఉద్దేశం కూడా లేదని ఆమె స్పష్టం చేశారు. కేవలం క్రిప్టో లావాదేవీలపై ఎవరైనా లాభాలు పొందితే పన్ను మాత్రం వేస్తామని ఆమె అన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో ఇంటర్ నెట్ వినియోగదారుల సంఖ్య మూడు రెట్లు పెరిగిందని ఆమె అన్నారు. ఇంటర్నెట్ అండ్ మొబైల్ అసోసియేషన్ నివేదిక ప్రకారం త్వరలోనే పట్టణ ప్రాంత వినియోగదారుల సంఖ్యను గ్రామీణ ప్రాంత వినియోగదారుల సంఖ్య దాటనుందని ఆమె తెలిపారు. 2021 మార్చి నాటికి దేశంలో ఇంటర్ నెట్ సబ్స్క్రయిబర్స్ సంఖ్య 82.5 కోట్లని ఆమె చెప్పారు.