For Money

Business News

ఛైర్మన్‌గా చంద్రశేఖరన్‌ కొనసాగింపు?

తీవ్ర సంక్షోభంలో ఉన్న టాటా గ్రూప్‌లో స్థిరత్వం తేవడమే గాక… అనేక కంపెనీలను ఆర్థికంగా పరిపుష్టం చేయడంలో విజయం సాధించిన టాటా సన్స్ ఛైర్మన్‌ ఎన్‌ చంద్రశేఖరన్‌ పదవీకాలం నేటితో పూర్తవుతుంది. కొత్త ఛైర్మన్‌ లేదా ఉన్న ఛైర్మన్‌ను కొనసాగించే అంశంపై నిర్ణయం తీసుకునేందుకు ఇవాళ టాటా సన్స్‌ సమావేశం కానుంది. టాటా గ్రూప్‌ కంపెనీలకు టాటా సన్స్‌ హోల్డింగ్‌ కంపెనీగా ఉన్న అంశం తెలిసిందే. టాటా గ్రూప్‌ కంపెనీలను స్టార్‌ కంపెనీలుగా మార్చి… కంపెనీ ఇన్వెస్టర్ల సంపదను భారీగా పెంచిన నాయకుడిగా చంద్రశేఖరన్‌ పేరు సంపాదించుకున్నారు. దీంతో ఇవాళ భేటీ అయ్యే టాటా సన్స్‌ బోర్డు… ఎన్‌ చంద్రశేఖరన్‌ను మరో అయిదేళ్ళ పాటు ఛైర్మన్‌గా కొనసాగించేందుకు గ్రీన్‌ ఇస్తుందని భావిస్తున్నారు. టీసీఎస్‌ కంపెనీని అంతర్జాతీయ స్థాయి ఐటీ కంపెనీగా తీర్చి దిద్దిన ఎన్‌ చంద్రశేఖరన్‌కు టాటా సన్స్‌ పగ్గాలను 2017లో అప్పజెప్పారు.