వడ్డీ రేట్లలో మార్పు లేదు..
కీలక వడ్డీ రేట్లను మార్చరాదని ఆర్బీఐ నిర్ణయించింది. వడ్డీ రేట్లను పెంచకుండా ఉండటం ఇది వరుసగా పదోసారి. ద్రవ్యోల్బణం పెరుగుతున్నా… వృద్ధిని దృష్టిలో పెట్టుకుని రెపో, రివర్స్ రెపో రేట్లను పెంచరాదని ఆర్బీఐ నిర్ణయించింది.ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో వృద్ధి రేటు 9.2 శాతం ఉంటుందని అంచనా వేసిన ఆర్బీఐ, వచ్చే ఆర్థిక సంవత్సరానికి వృద్ధి రేటును 7.8 శాతానికి పరిమితం చేసింది. మూడు రోజుల పాటు జరిగిన మానిటరీ పాలసీ కమిటీ (ఎంపీసీ) సమావేశం ఇవాళ ముగిసింది. సమావేశ వివరాలను ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస మీడియాకు వివరించారు.
ఇవాళ్టి విధానం తరవాత…
రెపో రేటు 4 శాతం
రివర్స్ రెపో రేటు 3.35 శాతం
బ్యాంక్ రేటు 4.25 శాతం
మార్జినల్ స్టాండింగ్ ఫెసిలిటీ రేటు 4.25 శాతం