మరింత పెరిగిన పేటీఎం నష్టాలు
డిసెంబరుతో ముగిసిన త్రైమాసికంలో ఫిన్టెక్ మేజర్ పేటీఎం కంపెనీ మాతృసంస్థ వన్97 కమ్యూనికేషన్స్ రూ.778.5 కోట్ల నష్టాలను ప్రకటించింది. అంతకుముందు ఏడాది ఇదే కాలంలో నష్టాలు రూ.535.5 కోట్లుగా ఉన్నాయి. ఇదే సమయంలో మొత్తం ఆదాయం 88 శాతం వృద్ధితో రూ.1,456 కోట్లకు పెరిగింది. కంపెనీ కంట్రిబ్యూషన్ లాభం గతేఏడాది మూడో త్రైమాసికంలో 8.9 శాతం నుంచి ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 31.2 శాతానికి మెరుగుపడింది. ప్రత్యేక వినియోగదారుల సంఖ్య మూడో త్రైమాసికంలో వార్షికంగా 37 శాతం పెరిగి 64.4 మిలియన్లకు చేరుకుంది. ఈ త్రైమాసికంలో ఫిన్టెక్ ప్లాట్ఫామ్స్ ద్వారా రుణాల సంఖ్య 44 లక్షలకు పెరిగింది. ఇది వార్షికంగా 401 శాతం పెరిగి 55 % త్రైమాసిక వృద్ధిని సూచిస్తోంది.