దేవయాని:లాభం 44% జంప్
మనదేశంలో పిజ్జా హట్, కెఎఫ్‌సీలను నిర్వహిస్తున్న దేవయాని ఇంటర్నేషనల్ డిసెంబర్ నెల త్రైమాసికంలో చక్కటి పనితీరు కనబర్చింది. ఈ త్రైమాసికంలో కంపెనీ రూ. 624 కోట్ల టర్నోవర్‌పై రూ. 63 కోట్ల నికర లాభం ప్రకటించింది. గత ఏడాది ఇదే కాలంతో పోలిస్తే కంపెనీ ఆదాయం 64 శాతం పెరగ్గా, నికర లాభం 44 శాతం పెరిగింది. కంపెనీ EBITDA మార్జిన్ కూడా 61 శాతం పెరిగి రూ. 147 కోట్లకు చేరింది. కాని ఎన్ఎస్ఈ ఈ షేర్ 1.55 శాతం నష్టంతో రూ. 181 వద్ద ట్రేడవుతోంది. వాస్తవానికి ఈ షేర్ ఇవాళ రూ. 177.35ని కూడా తాకింది.