For Money

Business News

MID SESSION: 17500పైన నిఫ్టి

ఉదయం 17617 పాయింట్ల గరిష్థ స్థాయిని తాకిన నిఫ్టి తీవ్ర హెచ్చుతగ్గులకు లోనవుతోంది. మిడ్‌ సెష్‌ ముందు నిఫ్టి ఆరు సార్లు లాభాల నుంచి నష్టాల్లోకి జారుకుంది. మిడ్‌ సెషన్‌ తరవాత 17462 పాయింట్లను తాకి… ఇపుడు 17518 వద్ద ట్రేడవుతోంది. క్రితం ముగింపుతో పోలిస్తే 41 పాయింట్ల నష్టంతో ట్రేడవుతోంది. మిడ్‌ సెషన్‌ కల్లా షేర్ల ధరల్లో చాలా తేడా కన్పిస్తోంది. పలు షేర్లు లాభాల్లోని నుంచి నష్టాల్లోకి రాగా, మరికొన్ని రివర్స్‌లో ఉన్నాయి. నిఫ్టి నెక్ట్స్‌ ఒక్కటే గ్రీన్‌లో ఉంది. మిగిలిన సూచీలు అధిక నష్టాల్లో ఉన్నాయి. గోద్రెజ్‌ ప్రాపర్టీస్‌ షేర్‌ మిడ్‌ క్యాప్‌ నిఫ్టి గట్టిగా దెబ్బతీసింది. ఆ షేర్‌ 8.5 శాతం నష్టంతో ట్రేడవుతోంది. అలాగే ఫలితాలు బాగాలేని కొన్ని షేర్లు 2 శాతంపైగా నష్టంతో ట్రేడవుతున్నాయి. దీంతో మిడ్‌ క్యాప్‌ నిఫ్టి ఒక శాతంపైగా నష్టంతో ఉంది. యూరప్‌ మార్కెట్‌ గ్రీన్‌లో ట్రేడవుతున్నాయి. అలాగే అమెరికా మార్కెట్లు కూడా గ్రీన్‌లో ఉన్నాయి. ఎస్‌ అండ్‌ పీ 500 సూచీ ఒక శాతంపైగా గ్రీన్‌లో ఉంది. దీంతో నిఫ్టి గ్రీన్‌లో క్లోజవుతుందేమో చూడాలి.