జూకర్బర్గ్ను అంబానీ, అదానీలు దాటేశారు
నిన్న ఒక్క రోజే ఫేస్బుక్ షేర్ 26 శాతం క్షీణించడంతో ఆ కంపెనీ సీఈఓ జూకర్బర్గ్ సంపద భారీగా క్షీణించింది. నిన్న ఒక్కరోజే 2,900 కోట్ల డాలర్ల మేర ఆయన సంపద కరిగిపోయిందని… దీంతో జూకర్ బర్గ్ సంపద 8,500 కోట్ల డాలర్లకు చేరినట్లు ఫోర్బ్స్ రియల్ టైమ్ బిలియనీర్స్ ఇండెక్స్ పేర్కొంది. ఇదే జాబితాలో 9,010 కోట్ల డాలర్లతో అదానీ తరవాతి స్థానంలో ఉండగా, అదానీ తరవాత 9,000 కోట్ల డాలర్లతో ముకేష్ అంబానీ ఉన్నారు. అయితే బ్లూమ్బర్గ్ బిలియనీర్స్ ఇండెక్స్ ప్రకారం మార్క్ జూకర్బర్గ్ సంపద 8,960 కోట్ల డాలర్లు కాగా, ముకేష్ అంబానీ సంపద 8,920 కోట్లు. అంబానీ తరువాతి స్థానంలో 8,740 కోట్ల డాలర్లతో గౌతమ్ అదానీ ఉన్నారు. బ్లూమ్వర్గ్ సూచీ ప్రకారం ప్రపంచంలోనే అత్యంత సంపన్నుల జాబితాలో పదవ స్థానంలో జూకర్బర్గ్, 11వ స్థానంలో ముకేష్ అంబానీ, 12వ స్థానంలో గౌతమ్ అదానీ ఉన్నారు. ఫేస్బుక్ షేర్ ఇపుడు నాలుగు శాతం లాభంతో ట్రేడవుతోంది. దీంతో జూకర్బర్గ్ సంపద మళ్ళీ పెరిగినట్లుంది.