For Money

Business News

శిల్పాకు ప్రేమతో… రూ. 38 కోట్ల బంగ్లా

పోర్నోగ్రఫీ వీడియో యాప్‌లను నిర్వహిస్తున్నారంటూ ఆరోపణలు ఎదుర్కొంటున్న బాలీవుడ్ ప్రొడ్యూసర్.. నటి శిల్పా శెట్టి భర్త రాజ్ కుంద్రా మళ్ళీ వార్తల్లో నిలిచాడు. ఈసారి భార్య శిల్పా శెట్టికి జుహూలోని ఓ బంగ్లాను తన భార్య పేరున మార్చి రాజ్ కుంద్రా వార్తల్లో నిలిచాడు. ప్రస్తుతం రాజ్‌ కుంద్రా బెయిల్‌పై బయట ఉన్న విషయం తెలిసిందే. జుహూలోని గాంధీగ్రామ్‌ రోడ్డులో ఉన్న ఈ బంగ్లా 5,995 చదరపు అడుగుల్లో ఉంది. ఈ బంగ్లాలోని మొదటి ఫ్లోర్‌లోని అయిదు ఫ్లాట్లను భార్య పేరున రాజ్‌కుంద్ర బదిలీ చేశారు. జనవరి 21న ఈ డీల్‌ రిజిస్ట్రేషన్‌ జరిగిందని, దాదాపు రూ. 38.5 కోట్ల విలువైన ఈ బంగ్లా రిజిస్ట్రేషన్‌ కోసం రూ. 1.9 కోట్లు ఫీజు కింద చెల్లించినట్లు మనీకంట్రోల్‌ డాట్‌ కామ్‌ అనే వెబ్‌సైట్‌ పేర్కొంది. ఈ ప్రాంతంలో ప్రస్తుత మార్కెట్ విలువ ఒక్కో చదరపు అడుగు రూ. 65,000 వరకూ ఉందని తెలిపింది. బీచ్‌కు కేవలం 300 మీటర్ల దూరంలో ఈ బంగ్లా ఉండటం విశేషం.