హైదరాబాద్‌కు ఫిస్కర్ సెంటర్
అమెరికాలోని కాలిఫోర్నియా ప్రధాన కేంద్రంగా కార్యకలాపాలు సాగిస్తోన్న ఎలక్ట్రిక్ కార్ల తయారీ కంపెనీ ఫిస్కర్ ఇన్కార్పొరేటెడ్..హైదరాబాద్‌లో గ్లోబల్ టెక్నికల్ సెంటర్‌ను ఏర్పాటు చేయనుంది. కంపెనీ తన కార్లకు అవసరమైన సాఫ్ట్వేర్ టెక్నాలజీని ఈ సెంటర్లో అభివృద్ధి చేయనుంది. ఇందుకోసం కంపెనీ ఈ టెక్నికల్ సెంటర్లో 300 మందికి పైగా ఇంజనీర్లను నియమించుకోనుంది. బీఎండబ్ల్యూ జెడ్8, ఆస్టన్ మార్టిన్ డీబీ9 వంటి ప్రముఖ లగ్జరీ మోడళ్లను డిజైన్ చేసిన ప్రఖ్యాత కార్ డిజైనర్ హెన్రిక్ ఫిస్కర్ ఈ కంపెనీని ఏర్పాటు చేశారు. ఆయన భార్య గీతా ఫిస్కర్ భారత్‌కు చెందినవారే కావడం గమనార్హం. భారత్ సహా అంతర్జాతీయంగా ఇప్పటికే 25,000కు పైగా ఆర్డర్లు లభించాయని కంపెనీ తెలిపింది. భారత్‌లోకి ఓషియన్‌ను కంప్లీట్ బిల్ట్ యూనిట్ (సీబీయూ)గా దిగుమతి చేయాలనుకుంటోంది. ఇక రెండో మోడల్ పియర్‌ను భారత్‌లో తయారు చేయాలనుంది. 2024-25లో విడుదల కానున్న పియర్ కారు ధర దేశీయ మార్కెట్లో రూ.20 లక్షల స్థాయిలో ఉండవచ్చని అంచనా.