2 నెలల్లో రూ.10 లక్షల కోట్లు ఔట్!
ఒకే షేర్లో..నికరంగా రెండు నెలలు కాదు. కేవలం 50 రోజుల్లో ఇన్వెస్టర్ల సంపద రూ.10 లక్షల కోట్లు క్షీణించడమంటే మాటలు కాదు. అమెరికా ఐటీ, టెక్ కంపెనీలలో వచ్చిన అమ్మకాల ఒత్తిడికి నెట్‌ఫ్లిక్స్ వాటాదారులు పొందిన నష్టమిది.గత ఏడాది అక్టోబర్ చివర, నవంబర్ ఆరంభంలో ఈ షేర్ 700 డాలర్లకు చేరింది. ఆ స్థాయి నుంచి కేవలం రెండు నెలల్లో 351 డాలర్లకు పడింది. అంటే సగానికి పడిపోయిందన్నమాట. కంపెనీ మార్కెట్ క్యాపిటలైజేషన్ 14,400 కోట్ల డాలర్లు అంటే సుమారు రూ. 10 లక్షల కోట్లు క్షీణించింది.ఇవాళ నాస్డాక్ కోలుకోవడంతో నెట్‌ఫ్లిక్స్ షేర్ కాస్త కోలుకుని 377 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. ఫెడ్ నిర్ణయం తరవాత టెక్ షేర్లపై ఒత్తిడి వస్తే.. మళ్ళీ నెట్‌ఫ్లిక్స్ పడే అవకాశముందని అనలిస్టులు హెచ్చరిస్తున్నారు. నెట్‌ఫ్లిక్స్‌లో ప్రసారమైన స్విడ్ గేమ్‌లో ఈ కంపెనీ షేర్ కూడా భాగమైనట్లుందని అనలిస్టలు కామెంట్ చేస్తున్నారు. 2020 ఏప్రిల్ తరవాత కనిష్ఠ స్థాయికి ఈ షేర్ పడింది. అంటే కరోనా సమయంలో ఈ కంపెనీ షేర్ పొందిన లాభాలన్నీ కరిగిపోయాయి. 2020లో 3.6 కోట్ల మంది, 2021లో మరో 1.82 కోట్ల మంది కొత్త సబ్‌స్క్రయిబర్స్ చేరారు. అయినా… ఈ షేర్ 50 శాతం దాకా పడటం మార్కెట్ విశ్లేషకులను ఆశ్చర్యపర్చింది.