For Money

Business News

పీటీసీ ఇండియా ఫైనాన్స్‌ షేర్‌ 20 శాతం డౌన్‌

కంపెనీ నిర్వహణలో అనేక లోపాలు ఉన్నాయంటూ ముగ్గురు స్వతంత్ర డైరెక్టర్ల రాజీనామాతో PTC ఇండియా ఫైనాన్షియల్‌ కంపెనీ షేర్‌పై ఇవాళ తీవ్ర ఒత్తిడి వచ్చింది. ఒకదశలో ఈ షేర్‌ రూ.20.65కి పడిపోయింది. రూ. 20.95 వద్ద ముగిసింది. పీటీసీ ఇండియా ఫైనాన్షియల్ సర్వీసెస్ మాతృ సంస్థ పీటీసీ ఇండియా షేర్లు కూడా బీఎస్‌ఈలో 7 శాతం క్షీణించి రూ.104.50కి చేరుకున్నాయి.
“కొన్ని కారణాల వలన ముగ్గురు స్వతంత్ర డైరెక్టర్ల రాజీనామాలను ఆమోదించాం. రాజీనామాలపై బోర్డులో నిర్ణయిస్తాం. తదుపరి తీసుకోవల్సిన చర్యల గురించి వాటాదారులకు తగిన విధంగా తెలియజేయబడుతుంది’’ అని PTC ఇండియా ఫైనాన్షియల్ ఎక్స్ఛేంజ్ ఫైలింగ్‌లో తెలిపింది. కమలేష్ శివ్‌జీ వికామ్సే, థామస్ మాథ్యూ టి. మరియు సంతోష్ బి. నాయర్‌లు కంపెనీ డైరెక్టర్ల పదవి నుంచి వైదొలిగారు. నూజివీడ్‌ సీడ్స్‌ లిమిటెడ్‌ (ఎన్‌ఎస్‌ఎల్‌) గ్రూప్‌నకు చెందిన ఎన్‌ఎస్‌ఎల్ నాగపట్నం పవర్‌ అండ్‌ ఇన్‌ఫ్రాటెక్‌ కంపెనీకి రూ. 150 కోట్ల రుణం ఇవ్వడంలో నిబంధనలకు తూట్లు పొడిచిటన్లు ఇండిపెండెండ్‌ డైరెక్టర్లు ఆరోపించిన విషయం తెలిసిందే. ఈ రుణం మొత్తం మోసమని వీరు ఆర్‌బీఐకి కూడా లేఖ రాశారు.