For Money

Business News

వాల్‌స్ట్రీట్‌ అప్‌, క్రూడ్‌@89

నిరుద్యోగ భృతి కోసం వచ్చిన క్లయిముల సంఖ్య మూడు నెలల గరిష్ఠానికి చేరడంతో మళ్ళీ స్టాక్‌ మార్కెట్‌లో కొనుగోళ్ళు కన్పించాయి. నిరుద్యోగ భృతి క్లయిములు పెరిగినందున… వడ్డీ రేట్లను చాలా తొందరగా, ఎక్కువసార్లు పెంచరనే టాక్‌ ఇపుడు మార్కెట్‌లో వినిపిస్తోంది. నాస్‌డాక్‌ 1.6 శాతం లాభంతో ట్రేడవుతుండగా, మిగిలిన డౌజోన్స్‌, ఎస్‌ అండ్‌ పీ 500 సూచీలు ఒక శాతంపైగా లాభంతో ట్రేడవుతున్నాయి. మరోవైపు డాలర్‌ స్థిరంగా ఉన్నా క్రూడ్‌ ధరలు పెరుగుతూనే ఉన్నాయి. బ్యారెల్‌ క్రూడ్‌ ధర మళ్ళీ 89 డాలర్లకు చేరింది. అలాగే బులియన్‌లో మిశ్రమ రియాక్షన్‌ కన్పిస్తోంది. బంగారం స్వల్పంగా క్షీణించగా, వెండి రెండు శాతం దాకా పెరిగింది.