చివర్లో కోలుకున్న నిఫ్టి
వీక్లీ డెరివేటివ్ క్లోజింగ్ ప్రభావం మార్కెట్ ఇవాళ కన్పించింది. సింగపూర్ నిఫ్టి లాభాలకు భిన్నంగా బలహీనంగా ప్రారంభమైన నిఫ్టి ఆరంభంలో నిలదొక్కుకున్నట్లు కన్పించినా… గంటకే నష్టాల్లోకి జారుకుంది.ఇవాళ్టి కనిష్ఠ స్థాయి 18,163ని తాకిన తరవాత నిఫ్టి మిడ్ సెషన్లో కోలుకుంది. కాని 1.30కి మళ్ళీ నష్టాలోకి జారుకుంది. ఇవాళ మొత్తం ఏడు సార్లు నష్టాల్లోకి వెళ్ళిన నిఫ్టి… ప్రతిసారీ కోలుకుంది. చివర్లో షార్ట్ కవరింగ్‌తో 20 పాయింట్ల లాభంతో 18232 వద్ద ముగిసింది. బ్యాంక్ నిఫ్టి ఇవాళ రెడ్‌లో ముగిసింది. ఎన్‌బీఎఫ్‌సీల నుంచి కూడా ఇవాళ ఎలాంటి మద్దతు అందలేదు. మిడ్‌క్యాప్‌తో సహా ఇతర సూచీలు కూడా నామ మాత్రపు లాభాలతో ముగిశాయి. యూరో మార్కెట్ కూడా లాభనష్టాల మధ్య కొట్టుమిట్టాడుతోంది. ఈ అయోమయంలో మార్కెట్ గ్రీన్‌లో క్లోజయ్యేందుకు ప్రయత్నించింది. నిన్న ఫలితాలు ప్రకటించిన మూడు ఐటీ షేర్లూ ఇవాళ మార్కెట్‌కు ఊపు ఇవ్వలేకపోయింది. ఇన్ఫోసిస్, టీసీఎస్ నామ మాత్రపు లాభాలతో క్లోజ్ కాగా, విప్రో ఏకంగా ఆరు శాతం నష్టాలతో ముగిసింది.