స్థిరంగా బులియన్ ధరలు
అంతర్జాతీయ మార్కెట్లో ఔన్స్ బంగారం ధర 1825 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. రాత్రి అమెరికా మార్కెట్లలో డాలర్ బాగా క్షీణించింది. డాలర్ ఇండెక్స్ అరశాతంపైగా తగ్గి 95 దిగువకు వెళ్ళింది. దీంతో నిన్న, ఇవాళ మన మార్కెట్లో బంగారం ధరలో తేడా అధికంగా ఉండొచ్చు. నిన్న రూ.4800లకుపైగా పెరిగిన కిలో వెండి ఇవాళ రూ.3000లకే పైగా నష్టం చూపుతోంది. అయినా ఒక్క రోజులో వెండి రూ.1000పైన లాభపడింది. ఇక బంగారం ధరల విషయానికొస్తే పెద్ద మార్పు లేదు. హైదరాబాద్లో 24 క్యారెట్ల అంటే స్టాండర్డ్ బంగారం 10 గ్రాముల ధర రూ.49,010 కాగా ఆర్నమెంట్ గోల్డ్ అంటే 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల రీటైల్ ధర రూ.45,000 ప్రాంతంలో ఉంది. అమెరికాలో ద్రవ్యోల్బణం 40 ఏళ్ళ గరిష్ఠ స్థాయికి చేరడంతో కరెన్సీ, కమాడిటీ మార్కెట్లలో తీవ్ర హెచ్చుతగ్గులు వస్తున్నాయి.