కర్ణాటకలో వారాంతపు కర్ఫ్యూ
రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య పెరుగుతుండటంతో వారాంతపు కర్ఫ్యూ విధించాలని కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. శుక్రవారం రాత్రి పది గంటల నుంచి సోమవారం ఉదయం5 గంటల వరకు కర్ఫ్యూ అమల్లో ఉంటుంది. రాష్ట్రంలో కోవిడ్ పరిస్థితిని సమీక్షించిన తరవాత ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. సినిమా థియేటర్లు, పబ్లు, రెస్టారెంట్లు 50 శాతం కెపాసిటీనే అనుమతిస్తారు. పది, 12వ తరగతి మినహా మిగిలిన అన్ని క్లాసులు ఆన్లైన్లోనే నిర్వహిస్తారు. రాష్ట్రంలో ఇపుడు అమలు అవుతున్న రాత్రిపూట కర్ఫ్యూ ఈ నెలాఖరు వరకు ఉంటుంది. పెళ్ళిళ్ళకు కేవలం 200 మందిని మాత్రమే అనుమతిస్తారు.