వాల్‌స్ట్రీట్: టెక్ డౌన్… డౌ అప్
వాల్‌స్ట్రీట్ మిశ్రమంగా ట్రేడవుతోంది. నిన్న భారీగా పెరిగిన టెక్, ఐటీ షేర్లు ఇవాళ డీలా పడ్డాయి. నాస్డాక్ ఏకంగా 1.5 శాతం నష్టంతో ట్రేడవుతోంది. ఎస్ అండ్ పీ 500 సూచీ స్వల్ప నష్టంతో ట్రేడవుతోంది. వీటికి భిన్నంగా డౌ జోన్స్ సూచీ 0.7 శాతం లాభంతో ముగిసింది. అంతకుముందు యూరో మార్కెట్లన్నీ ఒక శాతం దాకా లాభంతో ముగిశాయి. వాస్తవానికి వాల్‌స్ట్రీట్ గ్రీన్‌లో ప్రారంభమైంది. నాస్డాక్ నామ మాత్రపు నష్టాలతో ఉండగా, ఎస్ అండ్ పీ 500 కూడా గ్రీన్‌లో ఉంది. క్రమంగా ఈ రెండు సూచీలు బాగా నష్టపోయాయి. ఒమైక్రాన్ గురించి మార్కెట్లో భిన్న వాదనలు వినిపిస్తున్నాయి. డాలర్ బలపడంతో పాటు బాండ్ ఈల్డ్స్ కూడా బాగా పెరుగుతున్నాయి.