గోల్డ్ ఎక్స్చేంజ్లకు విధివిధానాలు ఓకే
దేశంలో కమొడిటీస్ మార్కెట్‌ను మరింత విస్తృతం చేసేందుకు సెబీ చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా స్టాక్ ఎక్స్సేంజ్‌ల ఆధ్వర్యంలో గోల్డ్ ఎక్స్చేంజ్ల ఏర్పాటుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇందుకు దోహదం చేసే వాల్ట్ మేనేజర్ల నిబంధనలు విడుదల చేసింది. దీంతో దేశంలోని స్టాక్ ఎక్స్చేంజ్లు ఇక గోల్డ్ ఎక్స్చేంజ్లు ఏర్పాటు చేసి లావాదేవీలు నిర్వహించవచ్చు. డిసెంబరు 31,2021 నుంచే ఈ నిబంధనలు అమల్లోకి వచ్చినట్టు సెబీ పేర్కొంది. ఈ గోల్డ్ ఎక్స్చేంజ్ల్లో పసిడి ఎలక్టా్ట్రనిక్ గోల్డ్ రిసీప్ట్స్ (ఈజీఆర్) రూపంలో ట్రేడవుతాయి. ఈజీఆర్‌ల రూపకల్పన, డిపాజిట్ల రూపంలో వాటి స్వీకరణ, స్టోరేజీ, భద్రపరచడం, విత్డ్రాల్స్ వంటివన్నీ వాల్ట్ మేనేజర్లే నిర్వహించాలి. దీంతో స్పాట్ మార్కెట్లో పసిడి ధరలపై పూర్తి పారదర్శకత ఏర్పడుతుందని భావిస్తున్నారు.