For Money

Business News

డాలర్‌ డౌన్‌… వాల్‌స్ట్రీట్‌ అప్‌

చాలా రోజుల తరవాత కరెన్సీ మార్కెట్‌లో డాలర్‌ కాస్త బలహీన పడింది. డాలర్‌ ఇండెక్స్‌ 0.33 శాతం నష్టంతో ట్రేడవుతోంది. దీనితో బులియన్‌, క్రూడ్‌ గ్రీన్‌లో ఉన్నాయి. ఇక స్టాక్‌ మార్కెట్‌ విషయానికొస్తే… ఆరంభంలో కాస్త తడబడినా.. ఇపుడు మార్కెట్‌ గ్రీన్‌లో ఉంది. అన్ని సూచీలు దాదాపు అర శాతం లాభంతో ఉన్నాయి. రేపు కూడా మార్కెట్‌ ఉన్నా… ఇన్వెస్టర్లు, బ్రోకింగ్‌ సంస్థలు ఇప్పటికే హాలిడే మూడ్‌లోకి వెళ్ళిపోయారు. బహుశా రెండో తేదీ వరకు మార్కెట్ల మధ్య లింక్‌ కష్టమే. ఒక మార్కెట్‌ ఉంటే మరో మార్కెట్‌ ఉండదు. క్రిస్మస్‌ సెలవుల తరవాత కొత్త ఏడాది సంబరాలు పూర్తయిన తరవాతే మార్కెట్‌ నిలకడగా ట్రేడయ్యే అవకాశముంది.