భారీ లాభాల్లో ముగిసిన నిఫ్టి
మిడ్ సెషన్లో రెండు గంటల తరవాత నిఫ్టి అనూహ్యంగా భారీ లాభాలతో ముగిసింది. యూరో మార్కెట్లు మిశ్రమంగా చాలా డల్‌గా ఉన్నా…నిఫ్టి ఏకంగా 184 పాయింట్ల లాభంతో 16,955 వద్ద ముగిసింది. అంతకుముందు 16,971ని కూడా తాకింది. ఇవాళ ఉదయం ఒక మోస్తరు లాభాలతో ప్రారంభమైన నిఫ్టి మిడ్ సెషన్‌కు ముందు ఇవాళ్టి కనిష్ఠ స్థాయి 16,819ని తాకింది. అక్కడి నుంచికోలుకుని క్రమంగా పెరుగుతూ వచ్చి… 2 గంటల తరవాత ఊపందుకుంది. ఇవాళ మిడ్ క్యాప్ సూచీ 1.7 శాతం లాభంతో ముగియడం విశేషం. ఇవాళ నిఫ్టి మెటల్స్, బ్యాంకుల నుంచి గట్టి మద్దతు లభించింది. నిఫ్టిలో 42 షేర్లు లాభాలతో ముగిశాయి. హిందాల్కో నిఫ్టి టాప్ గెయినర్ కాగా, మిడ్ క్యాప్ ఎస్ఆర్ఎఫ్ టాప్ గెయినర్‌గా నిలిచింది. గత కొన్ని రోజులుగా డల్‌గా ఉన్న ఎస్ఆర్ఎఫ్ ఇవాళ ఆరు శాతంపైగా లాభపడింది. మిడ్ క్యాప్ నిఫ్టిలో 46 షేర్లు లాభాల్లో ముగియగా కేవలం నాలుగు షేర్లు నష్టాల్లో ముగిశాయి. రేపు మార్కెట్లో వీక్లీ డెరివేటివ్స్ ముగింపు ఉంది.