For Money

Business News

షెనెల్‌ కంపెనీ సీఈఓగా లీనా నాయర్‌

ఫ్రాన్స్‌కు చెందిన అంతర్జాతీయ ఫ్యాషన్‌ కంపెనీ ‘షెనెల్‌ లిమిటెడ్‌’కు గ్లోబల్‌ చీఫ్‌ ఎగ్జిక్యూటివ్‌గా లీనా నాయర్‌ నియమితులయ్యారు. రూ. 76,000 కోట్ల టర్నోవర్‌ ఉన్న ఈ కంపెనీ మహిళల లగ్జరీ ఫ్యాషన్‌ వస్తువులను విక్రయిస్తోంది. దాదాపు 110 ఏళ్ళ ఈ కంపెనీలో ఓ భారతీయరాలు చీఫ్‌ ఎగ్జిక్యూటివ్‌గా చేరడం ఇదే మొదటిసారి. లీనా నాయర్‌ ప్రస్తుతం యూనిలివర్‌లో చీఫ్‌ హ్యుమన్‌ రీసోర్సస్‌ ఆఫీసర్‌ ఉన్నారు. జనవరిలో ఈమె ఛానల్‌ లిమిటెడ్‌లో చేరుతున్నారు.