నష్టాల్లో వాల్‌స్ట్రీట్
అమెరికా కేంద్ర బ్యాంక్ ఫెడరల్ రిజర్వ్ ఈ వారం సమావేశం కానుంది. ఈ నేపథ్యంలో మార్కెట్లలో అనిశ్చితి పెరిగింది. అలాగే ఒమైక్రాన్ భయం కూడా క్రమంగా బలపడుతోంది. దీంతో అమెరికా మార్కెట్లు ఆరంభంలోనే భారీ నష్టాలతో మొదలయ్యాయి. ఐటీ షేర్లలో అమ్మకాల జోరు అధికంగా ఉంది. నాస్డాక్ ఒక శాతంపైగా నష్టపోగా, ఎస్ అండ్ పీ 500 సూచీ 0.7 శాతంపైగా నష్టంతో ట్రేడవుతోంది. ఈ రెండు సూచీల మాదిరిగానే డౌజోన్స్ కూడా 0.7 శాతం నష్టంతో కొనసాగుతోంది. కరెన్సీ మార్కెట్లో డాలర్ కాస్త బలపడింది. దీంతో క్రూడ్ ధరలు స్వల్పంగా తగ్గాయి. బ్రెంట్ క్రూడ్ 75 డాలర్ల ప్రాంతంలో ట్రేడవుతోంది. బులియన్ మార్కెట్లో పెద్ద మార్పు లేదు.