For Money

Business News

పబ్లిక్‌ ఇష్యూకు మోర్‌ రిటైల్‌!

అమెజాన్‌కు చెందిన మోర్‌ రిటైల్‌ కంపెనీ పబ్లిక్‌ ఇష్యూకు రావాలని భావిస్తోంది. కంపెనీ విలువను 5 బిలియన్‌ డాలర్లుగా (దాదాపు రూ.37,500 కోట్లు) లెక్కిస్తున్నారు. 50 కోట్ల డాలర్ల(సుమారు రూ.3750 కోట్లు) వరకు నిధులను సమీకరించాలని కంపెనీ యోచిస్తోంది. వచ్చే ఏడాది జూన్‌ కంటే ముందే మోర్‌ పబ్లిక్‌ ఇష్యూకు వచ్చే అవకాశాలున్నాయి.2019లో మోర్‌ రిటైల్‌ను ఆదిత్య బిర్లా గ్రూప్‌ నుంచి అమెజాన్‌, సమారా క్యాపిటల్‌ పార్టనర్స్‌లకు చెందిన విట్‌జిగ్‌ అడ్వైజరీ సర్వీసెస్‌ కొనుగోలు చేసింది. ప్రస్తుత చర్చలు ప్రారంభ దశలోనే ఉన్నాయి. ఇష్యూకు సంబంధించిన ఇతర వివరాలు త్వరలోనే వెల్లడి అయ్యే అకకాశాలు ఉన్నాయి.