భారీ లాభాలతో ప్రారంభం కానున్న నిఫ్టి
చాలా రోజుల తరవాత ఆసియా మార్కెట్లు ఆకర్షణీయ లాభాలతో ట్రేడవుతున్నాయి. ముఖ్యంగా చైనా, హాంగ్‌కాంగ్ మార్కెట్ల లాభాలు భారీగా ఉన్నాయి. శుక్రవారం వాల్‌స్ట్రీట్ లాభాల్లో ముగిసింది. ఎస్ అండ్ పీ 500, నాస్డాక్ సూచీలు 0.75 శాతంపైగా లాభాలతో ముగిశాయి. ఆసియా మార్కెట్లలో చైనా A50 సూచీ 1.4 శాతం లాభంతో ట్రేడవుతోంది. హాంగ్‌సెంగ్, జపాన్ నిక్కీ సూచీ ఒక శాతం లాభంతో ట్రేడవుతున్నాయి. సింగపూర్ నిఫ్టి కూడా 100 పాయింట్లకుపైగా లాభంతో ట్రేడవుతోంది. ఈలెక్కన నిఫ్టి ఇవాళ ఆకర్షణీయ లాభంతో ప్రారంభం కానుంది.