For Money

Business News

రేపు టెగా ఇండస్ట్రీస్‌ లిస్టింగ్‌: బంపర్‌ లాభాలు?

పాలిమర్స్‌ రంగంలో నిమగ్నమైన టేగా ఇండస్ట్రీస్‌ పబ్లిక్‌ ఆఫర్‌ రేపు లిస్ట్‌ కానుంది. ఈ కంపెనీ రూ.443-రూ. 453 ధరకు ఆఫర్‌ చేశారు. చివరికి రూ.453లకు షేర్‌ ధరను ఖరారు చేశారు. లాట్‌ సైజు 33 షేర్లు. రేపు ఈ షేర్‌ 65 శాతం లేదా 70 శాతం లాభంతో లిస్ట్‌ అయ్యే అకవాశముంది. అంటే రూ. 775 ప్రాంతంలో లిస్ట్‌ కావొచ్చన్నమాట. ఒకవేళ డిమాండ్‌ వచ్చే పక్షంలో ఓపెనింగ్‌ రోజే రూ. 850కి కూడా చేరొచ్చని కొంత మంది బ్రోకర్లు అంటున్నారు. ఈ ఇష్యూ 219 రెట్లు అధికంగా సబ్‌స్క్రయిబ్‌ అయింది. అయితే రీటైల్‌ సబ్‌స్క్రిప్షన్‌ మాత్రం 29 రెట్టు సబ్‌స్క్రయిబ్‌ అయింది. అయినా రేపు మంచి ప్రీమియంతో లిస్ట్‌ అయ్యే అవకాశముంది.