పదింటికి ఆర్బీఐ క్రెడిట్ పాలసీ
ఆర్బీఐ పరపతి విధానాన్ని ఇవాళ ఉదయం పది గంటలకు ప్రకటిస్తారు. 12 గంటలకు ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ మీడియాతో మాట్లాడుతారు.మానిటరీ పాలసీ కమిటీ (ఎంపీసీ) సోమవారం నుంచి భేటీ అవుతోంది. దేశ, అంతర్జాతీయ ఆర్థిక పరిస్థితులను మదింపు చేసే తమ నిర్ణయాన్ని ఇవాళ ప్రకటించనుంది. ఇటీవల అనేక దేశాల్లో వడ్డీ రేట్లను పెంచుతున్నారు. ఒమైక్రాన్ నేపథ్యంలో ఆర్బీఐ ఇవాళ వడ్డీ రేట్లలో మార్పులు చేయకపోవచ్చని మెజారిటీ బ్యాంకర్లు భావిస్తున్నారు. విధానపరమైన..ముఖ్యంగా క్రిప్టో కరన్సీకి గురించి ఆర్బీఐ గవర్నర్ ఏమైనా వ్యాఖ్యలు చేస్తారా అని మార్కెట్ ఎదురు చూస్తోంది.నిన్న షార్ట్ కవరింగ్‌తో భారీగా లాభపడిన షేర్ మార్కెట్ ఇవాళ ఆర్బీఐ గవర్నర్ ప్రసంగానికి స్పందించే అవకాశాలున్నాయి.