పేటీఎం బాటలో స్టార్ హెల్త్ IPO
పేటీఎం స్థాయిలో లేకున్నా స్టార్ హెల్త్ షేర్లు ఎల్లుండి నష్టాలతో ప్రారంభం కానుంది. ఇప్పటికే అనధికార మార్కెట్లో రూ. 80 నష్టంతో ఈ షేర్ ట్రేడవుతోంది. ఈ షేర్ రూ. 870- రూ.900 ధరకు ఆఫర్ చేశారు. ఇపుడు అనధికార మార్కెట్లో ఈ షేర్ రూ. 800 ప్రాంతంలో ఉన్నట్లు తెలుస్తోంది. వాస్తవానికి పబ్లిక్ ఇష్యూ సమయంలో తన ఉద్యోగులకు రూ.80 డిస్కౌంట్‌కు కంపెనీ షేర్లను ఆఫర్ చేసింది. ఆ కంపెనీ ఉద్యోగులకే ఈ షేర్లకు దరఖాస్తు చేయలేదు. అంటే రూ. 820కు కూడా కొనలేదన్నమాట. మరి ఎల్లుండి రూ.800 దిగువకు వస్తే.. ఎంత వరకు పడుతుందనే అంశంపై షేర్ మార్కెట్లో చర్చ జరుగుతోంది. పేటీఎం మాదిరిగానే ఈ షేర్ ధరను కూడా బాగా పడగొట్టి… కొంటారా అన్నది చూడాలి.