టెక్ షేర్లలో భారీ అమ్మకాలు
నిన్నటి లాభాలకు మించిన నష్టాలతో వాల్‌స్ట్రీట్ ట్రేడవుతోంది. యాపిల్ ఇవాళ మరో 4 శాతం దాకా పడింది. ఇతర టెక్ షేర్లలో భారీ అమ్మకాలు రావడంతో నాస్డాక్తోపాటు ఎస్ అండ్ పీ 500 సూచీలు బాగా క్షీణించాయి. నాస్డాక్ 2.7 శాతం క్షీణించగా, ఎస్ అండ్ పీ 500 సూచీ 1.5 శాతం క్షీణించింది. యూరో షేర్లలో పతనం తక్కువగానే ఉంది. నవంబర్‌లో వ్యవసాయేతర ఉద్యోగాలు ఆశించిన స్థాయి కంటే చాలా తక్కువగా పెరగడంతో డాలర్ కూడా స్థిరంగా ఉంది. క్రూడ్ ఆయిల్ ధరలు మాత్రం ఒకదశలో రెండున్నర శాతం పెరిగాయి. బ్రెంట్ క్రూడ్ 72 డాలర్ల దాకా వచ్చేసింది.