For Money

Business News

NIFTY TODAY: పెరిగితే అమ్మండి

నిఫ్టి ఇవాళ ఇరువైపులా కదలాడే అవకాశముంది. నిఫ్టి క్రితం ముగింపు 17,401. సింగపూర్‌ నిఫ్టి ట్రెండ్‌ ప్రకారం చూస్తే నిఫ్టి నిన్నటి క్లోజింగ్‌కన్నా దిగువనే ప్రారంభం కానుంది. ఒకవేళ నిఫ్టి నష్టాలతో ప్రారంభమైతే…17,325 దాకా పడుతుందేమో చూడండి. ఈ స్థాయిని కోల్పోతే వెంటనే నిఫ్టి మద్దతు స్థాయి 17,310కి చేరే అవకాశాలు ఉంది. ఈ స్థాయికి దిగువకు చేరితే 17280 వద్దే మద్దతు లభించవచ్చు. తరవాతి స్థాయి 17,230. ఈ లెవల్స్‌ను గమనించండి. టెక్నికల్‌గా దిగువస్థాయిలో నిఫ్టికి మద్దతు లభించే అవకాశాలు ఉన్నాయి. మద్దతు అందితే 17400 దాటి ఎంత వరకు వెళుతుందో చూడండి. 17,475 వద్ద తొలి ప్రతిఘటన రావొచ్చు. ఈ స్థాయి దాటితే 17,490ని, 17,525ని చేరే అవకాశముంది. ఇవాళ శుక్రవారం. కాబట్టి పొజిషన్స్‌ చాలా వరకు క్లోజ్‌ చేయడం మంచిది. ఒమైక్రాన్‌ను మార్కెట్‌ పట్టించుకోవడం లేదు… కాని కేసులు అనూహ్యంగా పెరిగితే ట్రెండ్‌లో మార్పు రావొచ్చు. రిస్క్‌ వొద్దనుకునేవారు పొజిషన్లు ఇవాళే క్లోజ్‌ చేసుకోవడం మంచిది.