నష్టాలతో ప్రారంభం కానున్న నిఫ్టి
స్టాక్ మార్కెట్లను ఒమైక్రాన్ తీవ్రంగా ప్రభావం చూపుతోంది. రాత్రి అమెరికా మార్కెట్లను ఒమైక్రాన్ తీవ్రంగా దెబ్బతీసింది. టెక్ షేర్లలో భారీ అమ్మకాల ఒత్తిడి వస్తోంది. ఇక ఉదయం నుంచి ఆసియా మార్కెట్లు మిశ్రమంగా ఉన్నాయి. ఒమైక్రాన్ కేసులు ఈ ప్రాంతంలో తక్కువగా ఉన్నాయి. చైనా, హాంగ్సెంగ్లు గ్రీన్లో ఉన్నా జపాన్ మార్కెట్ నష్టాల్లో ఉంది. న్యూజిల్యాండ్ భారీ నష్టాల్లో ఉంది. ఈ నేపథ్యంలో సింగపూర్ నిఫ్టి 70 పాయింట్ల నష్టంతో ట్రేడవుతోంది. సో… నిఫ్టి కూడా నష్టాల్లో ప్రారంభమయ్యే అవకాశముంది.