సూచీలు గ్రీన్‌లో… షేర్లు నష్టాల్లో…
నిఫ్టి దాదాపు క్రితం ముగింపు వద్దే ముగిసింది. క్రితం ముగింపుతో పోలిస్తే 28 పాయింట్ల లాభంతో 17,053 పాయింట్ల వద్ద నిఫ్టి ముగిసింది. ఇది పైకి కన్పించేది. ఇక లోతుగా ఏం జరిగిందో చూస్తే… మన మార్కెట్ చాలా బలహీనంగా ముగిసింది. ఉదయం ఆసియా మార్కెట్లు భారీ నష్టాల్లో ముగిశాయి. జపాన్ ఒకటిన్నర శాతం, హాంగ్‌సెంగ్ ఒక శాతం నష్టపోయాయి. యూరో మార్కెట్లు మాత్రం ఒక శాతం లాభంతో ఉన్నాయి. కాని మన మార్కెటు అటూ ఇటూ గాకుండా స్థిరంగా ముగిసింది. కాని ఆపరేటర్లు నిఫ్టిని టెక్నికల్‌గా 17,000పైన ఉంచేందుకు ప్రయత్నించారంతే. నిజానికి మార్కెట్లో అమ్మకాలు జోరుగా సాగాయి. నిఫ్టిలో 35 షేర్లు నష్టాలతో ముగిశాయి. స్టాక్ మార్కెట్‌ను మరింత లోతుగా ప్రతిబింబించే నిఫ్టి నెక్ట్స్, మిడ్ క్యాప్ షేర్ల సూచీలు ఒకటి నుంచి ఒకటిన్నర శాతం నష్టంతో ముగిశాయి. అనేక ప్రధాన షేర్లు నష్టాల్లో ముగిశాయి. సో… మన మార్కెట్లలో అమ్మకాల జోరు కొనసాగుతోంది.