నేడూ భారీ నష్టాలతో ప్రారంభం
చిత్రంగా రాత్రి అమెరికా మార్కెట్లు అనూహ్యంగా నష్టాల్లోకి జారుకున్నాయి. నిన్న వాల్‌స్ట్రీట్ గ్రీన్‌లో ప్రారంభమైంది. డౌజోన్స్‌తో పాటు నాస్‌డాక్ కూడా 0.7 శాతం లాభంతో ప్రారంభమయ్యాయి. క్లోజింగ్ సమయానికల్లా డౌజోన్స్ లాభాలన్నీ కోల్పోగా, నాస్‌డాక్ ఏకంగా 1.25 శాతం నష్టంతో ముగిసింది. ఇక ఉదయం నుంచి ఆసియా మార్కెట్లు మిశ్రమంగా ఉన్నాయి. చైనా గ్రీన్‌లో ఉన్నా లాభాలు నామమాత్రమే. ఇక జపాన్ మార్కెట్లకు ఇవాళ సెలవు. హాంగ్‌సెంగ్ ఒక శాతంపైగా నష్టంతో ఉంది. సింగపూర్ నిఫ్టి వంద పాయింట్ల నష్టంతో ఉంది. సో… నిఫ్టి ఇవాళ కూడా నష్టాలతో ప్రారంభం కానుంది.