ఒక్క రోజులో రూ. 8 లక్షల కోట్లు ఉఫ్!
గడచిన ఏడు నెలల్లో ఎన్నడూ లేనివిధంగా ఒకే ఒక్క రోజు స్టాక్ మార్కెట్లో ఇన్వెస్టర్ల సంపద రూ.7.6 లక్షల కోట్లు తగ్గింది. దాదాపు అన్ని రంగాల షేర్లు క్షీణించడం ఇవాళ్టి పతనం విశేషం. కొత్త వ్యవసాయ చట్టాల రద్దు నిర్ణయం ప్రభావం పీఎస్‌యూ షేర్లపై తీవ్రంగా పడింది. అలాగే సౌదీ ఆరామ్కో కంపెనీతో రిలయన్స్ డీల్ కటీఫ్ కావడంతో ఆ కంపెనీ షేర్ కూడా భారీగా క్షీణించింది. పేటీఎం ఇవాళ కూడా క్షీణించింది. కేవలం రెండు ట్రేడింగ్ సెషన్స్‌లో ఈ కంపెనీ మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.50,000 కోట్లకు పైగా క్షీణించింది. మార్కెట్ అప్ ట్రెండ్ నుంచి కన్సాలిడేషన్ మోడ్‌లోకి వచ్చిందని మార్కెట్ వర్గాలు అంటున్నాయి.