For Money

Business News

రెండే సెషన్స్‌లో 44 శాతం నష్టం!

దేశంలోనే అతి పెద్ద ఐపీఓగా రికార్డు సృష్టించిన పేటీఎం పబ్లిక్‌ ఇష్యూ… ఇన్వెస్టర్లను కేవలం రెండు రోజుల్లో నట్టేట ముంచిన ఇష్యూగా కూడా రికార్డు సృష్టించింది. కేవలం రెండు ట్రేడింగ్‌ సెషన్స్‌లో ఈ షేర్‌ ఏకంగా 44 శాతం క్షీణించడం ఓ రికార్డే. పబ్లిక్‌ ఆఫర్‌లో గరిష్ఠ ధర అయిన రూ.2150లకు వాటాను జారీ చేసింది పే టీఎం. లిస్టింగ్‌ రోజు భారీగా నష్టపోయిన పేటీఎం.. ఇవాళ కూడా భారీగా క్షీణించి ఒకదశలో రూ. 1,271ని తాకింది. ఇష్యూ ధరతో పోలిస్తే షేర్‌ 44 శాతం క్షీణించిందన్నమాట. క్లోజింగ్‌ సమయానికి ఇవాళ స్వల్పంగా కోలుకుని ఎన్‌ఎస్‌ఈలో రూ. 1362 వద్ద ముగిసింది. కంపెనీ మార్కెట్‌ క్యాపిటలైజేషన్‌ రూ. 1.25 లక్షల కోట్ల నుంచి రూ.88,294 కోట్లకు పడిపోయింది.