ముస్లిములకు క్రిప్టో కరెన్సీ నిషిద్ధం
కరెన్సీగా క్రిప్టో కరెన్సీని ముస్లిములు లావాదేవీలు నిర్వహించడం నిషిద్ధమని ఇండోనేషియాకు చెందిన జాతీయ మత కౌన్సిల్ అయిన నేషనల్ ఉలేమా కౌన్సిల్ ఆదేశించింది. క్రిప్టో కరెన్సీలో అనిశ్చితి ఉందని, అందులో ట్రేడ్ చేయడం జూదం వంటిదని, అలాగే దీనివల్ల సమాజానికి చెడు జరుగుతుందని ముస్లిముల మత గురువు అస్రోరన్ నియామ్ సోలేహ్ స్పష్టం చేశారు. నిపుణులతో కౌన్సిల్ చర్చించిన తరవాత ఈ నిర్ణయం తీసుకుంది. షరియా నిబంధనల మేరకు క్రిప్టో కరెన్సీ ఒక వస్తువు లేదా డిజిటల్ ఆస్తిగా పరిగణిస్తే కొనుగోలు చేయొచ్చని కౌన్సిల్ పేర్కొంది. ఇండోనేషియాలో ఆర్థిక పరిమైన అంశాలపై నిర్ణయాలు తీసుకునేముందు ఆర్థిక శాఖ లేదా దేశ కేంద్ర బ్యాంకు కూడా ఈ కౌన్సిల్ ఆమోదం పొందాల్సి ఉంటుంది.