For Money

Business News

నిఫ్టి నిలబడుతుందా?

అంతర్జాతీయ మార్కెట్లు స్థిరంగా ఉన్నాయి. కార్పొరేట్‌ ఫలితాలను బట్టి సూచీలు పెరుగుతున్నాయి. అన్ని దేశాల్లోనూ అంతే. ఇవాళ వచ్చిన చైనా డేటా కూడా ప్రోత్సాహకరంగా లేదు. ఈ నేపథ్యంలో నిఫ్టి ఇవాళ్టి పరిస్థితి చూద్దం. నిఫ్టి ఓవర్‌సోల్డ్‌ జోన్‌లో ఉన్నట్లు మార్కెట్‌ విశ్లేషకులు అంటున్నారు. సాంకేతికంగా మాత్రం నిఫ్టి ఏమాత్రం పెరిగినా అమ్మడానికి ఛాన్స్‌గా భావించాలని అనలిస్టులు అంటున్నారు. నిఫ్టి ఇవాళ్టి ట్రేడింగ్‌కు 17734 కీలక స్థాయి. ఈ స్థాయి నుంచి నిఫ్టి ఏ మాత్రం పెరుగుతుందో చూడండి. నిఫ్టికి తొలి ప్రతిఘటన 17,770 ప్రాంతంలో రావొచ్చు. తరవాతి ప్రతిఘటన 17800.ఈ స్థాయిల్లో నిఫ్టిని అమ్మొచ్చని అనలిస్టులు అంటున్నారు. 17734 దిగువకు నిఫ్టి చేరితే భారీ నష్టాలు ఉండొచ్చు. ఇక బై సిగ్నల్‌ చూస్తే 17,575 ప్రాంతంలో ఉంది. కాబట్టి కొనుగోలు అంశాన్ని పక్కన బెట్టి… ఓపెనింగ్‌ తరవాత నిఫ్టి పెరిగేంత వరకు ఆగి అమ్మడమే.