For Money

Business News

పే టీఎం ఐపీఓకు సెబీ ఆమోదం

డిజిటల్‌ పేమెంట్, ఫైనాన్షియల్‌ సర్వీసెస్‌ సంస్థ పేటీఎం పబ్లిక్‌ ఆఫర్‌కు లైన్‌ క్లియరైంది. పే టీఎం ఐపీఓకు స్టాక్‌ మార్కెట్‌ నియంత్రణ సంస్థ సెబి ఆమోదం తెలిపింది. మార్కెట్‌ నుంచి రూ. 16,600 కోట్లు వసూలు చేయాలని పేటేఎం నిర్ణయించింది. పరిమాణం రీత్యా దేశంలో ఇదే పెద్ద పబ్లిక్‌ ఆఫర్‌ అవుతుంది. నవంబర్‌లోనే లిస్టింగ్‌ ఉంటుందని భావిస్తున్నారు. కొత్త షేర్ల జారీ ద్వారా రూ. 8300 కోట్లు సమీకరిస్తుండగా, ఇపుడున్న ఇన్వెస్టర్లు రూ. 8300 కోట్ల షేర్లను అమ్ముకుంటున్నారు. ఏఎన్‌టీ, ఆలిబాబా, సాఫ్ట్‌బ్యాంక్‌, ఎలెవేషన్‌ క్యాపిటల్‌ వంటి ఇన్వెస్టర్లు తమ వాటాలో కొంత భాగాన్ని అమ్మనున్నారు.