For Money

Business News

సిగరెట్లపై భారీ పన్ను?

ఈ ఏడాది బడ్జెట్‌లో సిగరెట్లపై పన్ను వేయలేదు. అయినా ఐటీసీ షేర్‌ ఇన్వెస్టర్లను నిరుత్సాహ పరుస్తూనే ఉంది. గత ఏడాది అక్టోబర్‌ 30న ఈ షేర్‌ రూ. 163 కనిష్ఠ స్థాయిని తాకింది. అప్పటి నుంచి కాస్త పెరిగి.. దాదాపు రెండేళ్ళపాటు దాదాపు రూ. 190-రూ.210 రేంజ్‌లో తిరుగుతోంది. ఎట్టకేలకు గత సెప్టెంబర్‌లో ఆ రేంజ్‌ నుంచి బయటపడింది. గత సోమవారం రూ.265కు చేరింది. అంతే ఈ వారమంతా నిఫ్టి నష్టాల్లో ఉండే సరికి షేర్‌ రూ. 244.70కి వచ్చింది. ఇవాళ మరో నెగిటివ్‌ న్యూస్‌ రావడంతో ఈ షేర్‌ ఇవాళ ఏకంగా 4.5 శాతం పడి రూ.233.70కి పడింది. చివరకు రూ. 236.50 వద్ద ముగిసింది. వార్త ఏమిటంటే… సిగరెట్లపై పన్ను విధించే అంశాన్ని పరిశీలించేందుకు వివిధ మంత్రిత్వ శాఖల నుంచి నిపుణులను ఎంపిక చేసి ఓ కమిటీని ప్రభుత్వం ఏర్పాటు చేసింది. సిగరెట్లపై ఏమేరకు పన్ను వేయవచ్చో ఈ కమిటీ సూచించే అవకాశముంది. ఐటీసీతో పాటు గాడ్‌ఫ్రే ఫిలిప్‌, వీఎస్‌టీ షేర్లు కూడా ఇవాళ పడ్డాయి.