పాలసీబజార్ ఐపీఓకు గ్రీన్ సిగ్నల్!
పాలసీ బజార్,పైసా బజార్ కంపెనీల మాతృ సంస్థ అయిన పీబీ ఫిన్‌టెక్ పబ్లిక్ ఇష్యూకు సెబీ ఆమోదం తెలిపినట్లు తెలుస్తోంది. మార్కెట్ నుంచి రూ. 6,017 కోట్లు సమీకరించాలని పీబీ ఫిన్ టెక్ ప్రతిపాదించింది. రూ.3750 కోట్లను తాజా ఈక్విటీని జారీ చేయడం ద్వారా కంపెనీ సేకరిస్తుంది. మిగిలిన మొత్తాన్ని ఇపుడున్న ఇన్వెస్టర్లు తమ వాటాలో కొంత భాగాన్ని ఇన్వెస్టర్లకు ఈ ఐపీఓ ద్వారా అమ్ముతారు. తమ వాటాలో కొంత భాగాన్ని సాఫ్ట్‌బ్యాంక్ విజన్ ఫండ్ పైథాన్ అమ్మనుంది. కంపెనీ ప్రమోటర్లయిన యాషిష్ దహియా కూడా తమ షేర్లలో రూ. 302.50 కోట్ల షేర్లను అమ్ముతారు. అయితే చైనాకు చెందిన టెన్సెంట్ మాత్రం తన వాటాను అమ్మడం లేదు.