18,500పైన ప్రారంభమైన నిఫ్టి
మార్కెట్ అన్ని రికార్డులను బద్ధలు కొడుతోంది. సింగపూర్ నిఫ్టికి భిన్నంగా ఏకంగా 170 పాయింట్ల లాభంతో నిఫ్టి ప్రారంభమైంది. ఓపెనింగ్‌లోనే 18,512 పాయింట్లను తాకిన నిఫ్టి ప్రస్తుతం 18,468 వద్ద ట్రేడవుతోంది. క్రితం ముగింపుతో పోలిస్తే నిఫ్టి 130 పాయింట్ల లాభంతో ఉంది. నిఫ్టి 18,460పైన ఉన్నంత వరకు నిఫ్టి పటిష్ఠంగా ఉండే అవకాశముంది. ఓపెనింగ్లోషార్ట్ చేసినవారికి ఒక మోస్తరు లాభాలు వచ్చాయి. నిఫ్టి ప్రస్తుత స్థాయి నుంచి ఏమాత్రం పెరిగినా అమ్మడానికి మంచి ఛాన్స్‌గా టెక్నికల్ అనలిస్టులు అంటున్నారు. నిఫ్టిలో 41 షేర్లు లాభాలతో ట్రేడవుతున్నాయి. మెటల్స్ మినహా మిగిలిన షేర్లకు పెద్ద లాభాలు లేవు. కాకపోతే చాలా షేర్లు లాభాల్లో ఉండటంతో నిఫ్టి భారీ లాభాలు గడించింది. నిఫ్టి నెక్స్ట్, నిఫ్టి మిడ్ క్యాప్, నిఫ్టి బ్యాంక్..అన్ని సూచీలు పటిష్ఠమైన లాభాల్లో ఉన్నాయి.