For Money

Business News

ఎఫ్‌ అండ్‌ ఓ బ్యాన్‌ లిస్ట్‌లో ఐఆర్‌సీటీసీ

ఇవాళ్టి ట్రేడింగ్ కోసం మార్కెట్-వైడ్ పొజిషన్ లిమిట్‌ 95% దాటిపోయిన షేర్ల జాబితాను ఎన్‌ఎస్‌ఈ ప్రకటించింది. ఈ షేర్లలో ఎఫ్ అండ్‌ ఓ సెగ్మెంట్‌లో ట్రేడింగ్‌ను నిషేధించారు. మునుపటి సెషన్‌లో నిషేధంలో ఉన్న నేషనల్ అల్యూమినియం కంపెనీ లిమిటెడ్ (నాల్కో), పంజాబ్ నేషనల్ బ్యాంక్ (పీఎన్‌బీ), స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా (సెయిల్) షేర్లు బ్యాన్‌ నుంచి బయటపడ్డాయి. ఆరు స్టాక్స్ లేదా సెక్యూరిటీలను ఎఫ్‌అండ్ఓ బ్యాన్ కిందకు వచ్చాయి. ఆ షేర్లు… ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ (IRCTC), బ్యాంక్ ఆఫ్ బరోడా (BoB), ఇండియాబుల్స్ హౌసింగ్ ఫైనాన్స్, సన్ టీవీ, భారత్ హెవీ ఎలక్ట్రికట్స్ లిమిటెడ్(భెల్‌).