For Money

Business News

పిల్లలకు కోవాగ్జిన్‌.. కేంద్రం గ్రీన్‌ సిగ్నల్‌

భారత్‌ బయోటెక్‌ పిల్లల కోసం తయారు చేసిన కరోనా వ్యాక్సిన్‌ కోవాగ్జిన్‌కు సెంట్రల్‌ డ్రగ్స్‌ స్టాండర్డ్‌ కంట్రోల్‌ ఆర్గనైజేషన్‌ (CDSCO)కు చెందిన సబ్జెక్ట్‌ ఎక్స్‌పర్ట్‌ కమిటీ (SEC) ఆమోదం తెలిపింది. అత్యవసర పరిస్థితుల్లో 2 నుంచి 18 ఏళ్ళలోపు ఉన్న వారికి ఈ వ్యాక్సిన్‌ వేసేందుకు గ్రీన్‌ సిగ్నల్‌ తెలిపింది. ఈ ఏడాది మేలో ప్రారంభమైన ఈ టీకా ప్రయోగాలు సెప్టెంబర్‌లో పూర్తయ్యాయి. పెద్దల కోసం తయారు చేసిన వ్యాక్సిన్‌ ప్రయోగదశలో ఎలాంటి ఫలితాలు చూపిందో… అదే ఫలితాలు పిల్లలపై జరిపిన అధ్యయనంలో వెల్లడైనట్లు తెలుస్తోంది. ఇతర టీకాలకు భిన్నంగా ఈ వ్యాక్సిన్‌ సూదీతో పాటు వస్తుంది. దీనివల్ల ఎంత వ్యాక్సిన్‌ ఇవ్వాలో అంతే ఇచ్చినట్లు అవుతుంది.