దీపక్ నైట్రేట్ భారీ జంప్
దీపక్ నైట్రేట్‌లో వరుసగా మూడో రోజూ పెరిగింది. ఇవాళ ఇంట్రాడేలో 7.50 శాతం పైగా లాభంతో డే గరిష్ట స్థాయి రూ.2, 873.10కు చేరింది. ఇది ఆల్‌టైమ్ గరిష్ట స్థాయి. గత 3 సెషన్స్‌లో ఈ షేర్ 20 శాతం పైగా పెరిగింది. చైనా ఇపుడు విద్యుత్ సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. దీంతో అనేక పారిశ్రామిక ఉత్పత్తల తయారీ తగ్గింది. చైనా కెమికల్స్ ఉత్పత్తి 25శాతం వరకు తగ్గే అవకాశం ఉందని వార్తలు వస్తున్నాయి.కెమికల్ తయారీ రంగంలో ఉన్నందున దీపక్ నైట్రేట్‌లో ఇన్వెస్టర్లు ఆసక్తి చూపుతున్నారు.